ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు - rajampet latest news
కడప జిల్లా రాజంపేట పరిధిలో... ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీధర్, ఇంకొకరు రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన గణపతిగా గుర్తించారు. శ్రీధర్‌పై గతంలోనూ వాహనాల చోరీ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ జల్సాలకు అలవాటు పడి... వాహనాలు చోరీ చేసి విక్రయించేవారని వెల్లడించారు.
Intro:Ap_cdp_50_14_5 dwichakra vahanalu_eddaru vyakthulu_arrest_Av_Ap10043 k.veerachari, 9948047582 ద్విచక్ర వాహన చోదకులు ఎవరైనా తమ వాహనాలకు తాళం వేయడం మరిచిపోయారా.. బండికి పక్క తాళం వేయలేదా.. అయితే మీ వాహనంపై దొంగలు కన్నేసి ఉంటారు.. క్షణాల్లో మాయం చేస్తారని డిఎస్పి నారాయణస్వామి రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో ఇటీవల ఐదు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిని దొంగలించిన ఇరువురు వ్యక్తుల ను పట్టుకున్నారు వాహనాలతో పాటు నిందితులను డిఎస్పి ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరు పరిచారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీధర్ గత ఐదేళ్లుగా రాజంపేట మండలం అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతంలో తన అన్న వద్ద నివసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను వాహనాలను చోరీ చేసి విక్రయించేవాడిని తెలిపారు. 6 ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణం పోలీస్స్టేషన్లో మూడు ద్విచక్ర వాహన కేసులు ఉన్నాయని, ఈ కేసుకు సంబంధించి జైలుకి వెళ్లి వచ్చాడని వివరించారు. మరో వ్యక్తి రాజపేట మండలం బోయినపల్లి కి చెందిన జి. గణపతి ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇతను రాజంపేట మండలం బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో మామిడి మండిలో పని చేస్తుండే వాడిని తెలిపారు. వీరిరువురు కలిసి 5 ద్విచక్ర వాహనాలను చోరీకి గురిచేసినట్లు వివరించారు. వీరు నుంచి రూ.2.20 లక్షల విలువచేసే 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ అమర్ కు రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నరసింహులు ఎస్ ఐ హనుమంతు పాల్గొన్నారు.
Body:5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ఇరువురు అరెస్ట్