Agrigold Victims Problems: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీర్చటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా సీఎం సొంత జిల్లాలో మరో సమస్య వచ్చి పడింది. 2015 సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న అగ్రిగోల్డ్ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. ప్రభుత్వ నిర్ణయంతో స్థలాలు అమ్మాలనుకున్న కుంటుబాలు గగ్గోలు పెడుతున్నాయి.
Agrigold Victims Protest: వైఎస్సార్ జిల్లాలోని కడప నగరపాలక సంస్థ పరిధిలోని రుద్రభారతిపేట వద్ద.. అగ్రిగోల్డ్ సంస్థ.. 23 ఎకరాల్లో 'శ్రీపాద' పేరుతో 2009లో వెంచర్ వేసింది. సర్వే నంబర్ 61 నుంచి 118 వరకు.. దాదాపు 346 మంది లబ్ధిదారులు ప్లాట్లు కొన్నారు. 2009 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 2015లో అగ్రిగోల్డ్‌పై కేసు నమోదు కావడంతో.. సంస్థ ఆస్తులు జప్తు చేశారు. అయినా ఈ వెంచర్‌లో 2022 అక్టోబరు వరకు క్రయ, విక్రయాలు జరిగాయి. అయితే.. గతేడాది డిసెంబరు నెల నుంచి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లకు సీఐడీ మౌఖికంగా ఆదేశాలిచ్చింది. ఫలితంగా ఏడాది నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచాయి.
Agrigold Victims on Suspension of Land Registrations: శ్రీపాద వెంచర్స్‌లో వివిధ ప్రాంతాలకు చెందినవారు ప్లాట్లు కొన్నారు. బద్వేలులోనూ ఇదేవిధంగా వేసిన అగ్రిగోల్డ్ వెంచర్స్‌లో రిజిస్ట్రేషన్లు నిలిపేశారని బాధితులు వాపోయారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేస్తే అభ్యంతరం లేదని.. తాము డబ్బు చెల్లించి కొనుకున్న స్థలాలను విక్రయించకుండా అడ్డుకోవడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. 23ఎకరాల అగ్రిగోల్డ్ వెంచర్స్‌లో రెండున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం ఖాళీగా ఉంచారు. ఆ స్థలాన్ని కొందరు అధికార పార్టీ నేతలు కొట్టేసేందుకు చూస్తున్నారని.. బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"కడప నగరపాలక సంస్థ పరిధిలోని రుద్రభారతిపేట వద్ద.. అగ్రిగోల్డ్ సంస్థ.. 23 ఎకరాల్లో 'శ్రీపాద' పేరుతో 2009లో వెంచర్ వేసింది. ఈ వెంచర్లో మేము ప్లాట్లు కొన్నాము. మేము కష్టపడి సంపాదించుకున్న మా నగదు పెట్టి కొనుకున్న ప్లాట్లు కొనుక్కున్నాము. అయితే.. గతేడాది డిసెంబరు నెల నుంచి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లకు సీఐడీ మౌఖికంగా ఆదేశాలిచ్చింది. దీంతో ఏడాది నుంచి రిజిస్ట్రేన్లు నిలిచిపోయాయి. బద్వేలులోనూ ఇదేవిధంగా వేసిన అగ్రిగోల్డ్ వెంచర్స్‌లో రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేస్తే మాకు అభ్యంతరం లేదు. అంతేకానీ.. మేము డబ్బు చెల్లించి కొనుకున్న స్థలాలను విక్రయించకుండా అడ్డుకోవడం ఏంటి..?. 23ఎకరాల అగ్రిగోల్డ్ వెంచర్స్‌లో రెండున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం ఖాళీగా ఉంచారు. ఆ స్థలాన్ని కొందరు అధికార పార్టీ నాయకులు కొట్టేసేందుకు చూస్తున్నారు." - అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన