ETV Bharat / state

అనిశాకు చిక్కిన సీనియర్ ఆడిటర్ - కడప జిల్లాలో ఏసీబీ వార్తలు

కడప ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఆడిటర్..అనిశా అధికారులకు చిక్కారు. ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

acb officers catched  senior auditor in kadapa district
లంచం తీసుకుంటు.. అనిశాకు చిక్కిన సీనియర్ ఆడిటర్
author img

By

Published : Mar 1, 2021, 5:49 PM IST

కడప జిల్లాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగికి సంబంధించి రావలసిన నగదు మంజూరు చేయడానికి ఐదువేల రూపాయలు లంచం తీసుకుంటున్న సీనియర్ ఆడిటర్ అబ్దుల్ జబ్బర్​​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

మైదుకూరు మండలంకు చెందిన పెద్ద వెంకటయ్య పదవీ విరమణ పొందారు. రావాల్సిన బకాయిలను మంజూరు చేయడానికి కడప ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఆడిటర్ అబ్దుల్ జబ్బర్ రూ.5,000 లంచం అడిగాడు. బాధితుడు... అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు లంచం తీసుకుంటున్న అబ్దుల్ జబ్బర్​ను పట్టుకొని.. కర్నూల్ ఏసీబీ కోర్టుకు తరలించారు.

ఇదీ చదవండి

చంద్రబాబుతో కడప జిల్లా తెదేపా నాయకుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.