పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన బాలకృష్ణ, హేమ దంపతులు. వారికి సంతానం లేకపోవటంతో ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన బాలకృష్ణ ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆనవాళ్లు లేకుండా ఆమెను బూడిద చేసి పంటకాలువలో పడేశాడు. పోలీసు కేసు లేకుండా ఉండేందుకు గ్రామ పెద్దలకు సమక్షంలో హతురాలి తల్లిదండ్రులతో 4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టటంతో అసలు విషయం బయటపడింది. దింతో నిందితుడితో పాటు ఎనిమిది మంది గ్రామ పెద్దలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీచదవండి