పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
19 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు, లారీని స్వాధీనం చేసుకున్నామని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. చోదకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: