పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగిలో...ఇళ్ల పట్టాల పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. సభ జరుగుతున్న సమయంలో మహిళలు కూర్చున్న ప్రాంతంలో ప్రమాదవశాత్తు కొబ్బరి చెట్టు కూలింది. చెట్టు కింద ఇరుక్కుపోయిన ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా..దుర్గ భవానీ, శాంతా ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీచదవండి
కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలి: చంద్రబాబు