అంతర్జాతీయ కవల పిల్లల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో వివిధ తరగతుల్లో చదువుతున్న 25 మంది కవలల జంటలతో వేడుక చేశారు. వారికి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. పూలు, పళ్లు పంపిణీ చేశారు. స్నేహితుల మధ్య ఈ వేడుక నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని కవల పిల్లలు సంతోషించారు.
ఇదీ చదవండి:
ఉత్సాహంగా పేరుపాలెం బీచ్ ఫెస్టివల్.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు