Gorantla Butchaiah Chaudhary Interesting Tweet: నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీలో అసమ్మతి సెగ రోజురోజుకు పెరుగుతోంది. ఇన్నాళ్లు అణిగిమణిగి ఉన్న నేతలు ఒక్కొక్కరూ తమ గళాన్ని విప్పుతున్నారు. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, వైసీపీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.. తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు అసమ్మతి స్వరం వినిపించడంతో అధిష్ఠానానికి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
-
వైసిపి కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా...!
జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు#గోరంట్ల#YCPcovertdrama#JaganDiversionPolitics
">వైసిపి కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 2, 2023
రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా...!
జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు#గోరంట్ల#YCPcovertdrama#JaganDiversionPoliticsవైసిపి కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 2, 2023
రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా...!
జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు#గోరంట్ల#YCPcovertdrama#JaganDiversionPolitics
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్.. ''వైసీపీ కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది. రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా..!. జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు.'' అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు ఆసక్తికర ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల అసమ్మతి గళం వినిపిస్తున్న తరుణంలో పార్టీ కార్యకర్తలను గోరంట్ల అప్రమత్తం చేస్తూ తనదైన శైలిలో స్పందించటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి