రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నేతల ధర్నా - updates of capital rally
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో తెదేపా నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు కిలోమీటరు మేర మానవహారంగా ఏర్పడి రైతులకు మద్దతుగా నినదించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా... అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Intro:మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మార్టేరు శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వెలగలేరు నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా సుమారు కిలోమీటరు పాదయాత్రగా నడిచి మార్టేరు సెంటర్ లో మానవహారంగా ఏర్పడి అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మూడు చోట్ల రాజకీయ నిర్ణయాన్ని కోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్, ఆచంట ,పెనుగొండ ఏఎంసీ మాజీ చైర్మన్లు సురేష్ బాబు, గోపాల కృష్ణ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.