ఆస్తి వివాదం కన్న తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉల్లంపర్తి పెద్దిరాజు(60), అతని కుమారుడు లాజరస్తో ఆస్తి విషయంలో వివాదం ఉంది. ఈ వ్యవహారంలో లాజరస్ తన తండ్రి పెద్దిరాజు గొంతుపై కాలితో తొక్కి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించి పెద్దిరాజు భార్య మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లిఖార్జున రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: