లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐడీ కేవీ మోహన్ రావు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ సందర్శించారు. స్టేషన్లో పలు దస్త్రాలు పరిశీలించి పట్టణంలో లాక్డౌన్ అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోసుబొమ్మ కూడలి, తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి, కాకర్ల జంక్షన్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న పికెట్లను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు. వ్యవసాయ అనుబంధ పనులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించుకోవాలి సూచించారు. లాక్డౌన్ ఉన్నా చాలాచోట్ల ప్రజలు రహదారులపై తిరుగుతున్నారని ఏలూరు రేంజి పరిధిలో 50 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి: వంట సరకులతో 3 కి.మీ నడిచిన కలెక్టర్, ఎమ్మెల్యే