పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో విద్యుదాఘాతంతో ముక్కపాటి రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను లక్కవరం సబ్స్టేషన్ లైన్మెన్కు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బాట గంగానమ్మ ఆలయం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు పోయింది. గ్రామస్థులు రామకృష్ణను పిలవగా... అతడు స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా జరిగి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :