అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో 2014లో అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్.. నేడు 3 రాజధానులను ప్రకటించడం ఎంతవరకు సమంజసమని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 30వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలను ఆనాడు స్వాగతించి నేడు ఎందుకు మాట మార్చారని నిలదీశారు. రాజధానిగా అమరావతే ఉంటుందంటూ ఎన్నికల ముందు ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాజధాని కోసం లక్ష కోట్లు అవసరమని చెప్తున్న ప్రభుత్వం.. అమరావతిని నిర్మిస్తే లక్షకోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు. మూడు రాజధానులపై ప్రజా తీర్పు అడిగే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి...