పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో ఆశ్రయం పొందిన వలస కూలీలు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలంటూ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.
లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు స్థానిక బాలయోగి గురుకుల పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వలస కూలీలను సొంత ప్రాంతాలకు పంపిస్తున్న నేపథ్యంలో తమను కూడా పంపాలంటూ రెండు రోజుల క్రితం ఆందోళనకు దిగారు.
అప్పుడు స్పందించిన రెవిన్యూ అధికారులు కొందరినే పంపారు. మిగతా 53 మంది ఇక్కడే ఉన్నారు. అధికారులు తమను పంపే విషయంలో జాప్యం చేస్తున్నారని మళ్లీ ఆందోళనకు దిగారు. రెవిన్యూ అధికారులు స్పందించి అనుమతి ఇవ్వగా... వారిని 2 బస్సుల్లో సొంత ప్రాంతాలకు తరలించారు.
ఇదీ చదవండి: