పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబాచర్లలో విద్యుదాఘాతానికి గురై.. వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఉంగుటూరు మండలం గోపాలపురానికి చెందిన బిక్కిన ప్రసాద్ వ్యవసాయ కూలి పనులు చేస్తుంటాడు. దూబచర్లలోని ఓ రైతు తోటలో ఆయిల్ఫామ్ గెలలు నరికేందుకు కూలి పనికి వెళ్లాడు. ఇనుప గెడ కత్తితో గెలలు నరికే క్రమంలో.. పైన ఉన్న విద్యుత్ తీగలకు తాకింది. విద్యుదాఘాతంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు.. చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి: మాగంటి బాబుకి లోకేష్ ఫోన్... రాంజీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా