పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పబ్లిక్ ఆఫర్ ను వ్యతిరేకించారు. ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు, స్టాఫ్ అసోసియేషన్ నాయకులు ఎల్ఐసి ఐపీఓ గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మేటి బీమా సంస్థగా ఉన్న భారతీయ జీవిత బీమా సంస్థ లో 25% మేర వాటాలు విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యిందని ఆగ్రహించారు.
40 కోట్ల పాలసీదారులతో, 32 లక్షల కోట్ల ఆస్తులతో, ప్రపంచంలో వాటాలకు క్లెయిముల పరిష్కార శాతంలో మొదటి స్థానంలో ఉన్న జీవిత బీమా సంస్థకు వాటాలు అమ్మవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల సొమ్ము, ప్రజల సంక్షేమానికి అనే నినాదంతో 64 యేళ్లుగా పని చేస్తూ, బీమా రంగ ప్రయివేటీకరణ జరిగి 20 యేళ్ళైనా, నేటికీ 70% మార్కెట్ వాటాతో, ఎల్ఐసీ దూసుకుపోతోందని చెప్పారు.
ఇదీ చదవండి: