ప్రతి ఒక్కరూ మాతృభాషను ప్రేమించాలని, గౌరవించాలని మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో హరిబాబు మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో మాతృభాషలను ప్రోత్సహించేందుకు కేంద్రం నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చిందన్నారు.
ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. మాతృభాషను విస్మరిస్తూ కొందరు పరభాషలపై వ్యామోహం పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంగా సినీనటుడు సాయికుమార్, పలు రాజవంశాల వారసులు, ప్రాచీన, ఆధునిక కవుల వారసులకు పూర్ణకుంభ పురస్కారాలను ప్రదానం చేశారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: