పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకు(union bank)లో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ ప్రమాదంలో క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండి: Cm Jagan: శ్రీవారి సేవలో సీఎం జగన్.. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి