పశ్చిమ గోదావరి జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కి చేరుకుంది. వీరిలో 58 మంది డిశ్చార్జ్ కాగా, 94 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో గత 4 రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
- జిల్లాలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలు
చెరుకువాడ 10
ఏలూరు 6
తణుకు, వీరవాసం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదయ్యింది.
జిల్లాలో ఇప్పటివరకు 32,419 మందికి పరీక్షలు నిర్వహించగా, 28,952 మందికి నెగిటివ్గా నివేదిక వచ్చినట్లు వెల్లడించారు. 3,315 పరీక్షల ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి, ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణం'