పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం పొణుకుమడు గ్రామంలో వాలంటీర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన శివకృష్ణ కొంతకాలంగా వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు మహిళ భర్త అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో శివకృష్ణ మహిళ ఇంటి వద్దకు వచ్చాడు. అది గమనించిన ఆమె భర్త..కోపోద్రిక్తుడై కత్తితో శివకృష్ణ తలపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు బాధితుడిని తొలుత చింతలపూడి ఆసుపత్రికి.., పరిస్థితి విషమించటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచదవండి