పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని ఒక ఇంట్లో తాచు పాము కలకలం రేపింది. శ్రీను అనే వ్యక్తి ఇంట్లోకి పాము రావడాన్ని గమనించాడు. ఆ పామును చంపేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. పాము ఇంటి పెంకుల్లోకి దూరిపోవడాన్ని గమనించి.. స్థానికుల సాయంతో ఇల్లు మొత్తం పీకేశాడు. పాముని చంపేందేకు ఇంటి గోడలు, పెంకులును తొలగించాడు. చివరికి పామును చంపినా.... తన ఇల్లును కూలగొట్టుకున్నామని ఆవేదన చెందుతున్నాడు.
ఇదీ చదవండి: