ETV Bharat / state

పంచాయతీలకు ఆర్థిక సంఘం రెండో విడత నిధులు విడుదల

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు విడుదల అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన నిధుల నిర్వహణపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

funds for panchayats
పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు
author img

By

Published : Oct 30, 2020, 9:50 AM IST

గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.1168.29 కోట్లు విడుదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాకు రూ.104.23 కోట్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాల వారీగా నిధులు కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలోని 900కి పైగా పంచాయతీలకు ఈ నిధులు కేటాయించనున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి సరఫరా పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణకు వీటిని ఖర్చు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.