ETV Bharat / state
వేరే మహిళతో భర్త సహజీవనం... భార్య మౌనదీక్ష - protest
ఆడ పిల్ల పుట్టిందన్న కారణంతో అత్తింటి వారి వేదింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ దత్తివలసలో మహిళ మౌన దీక్ష చేసింది. అదనపు కట్నం కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా వేరే మహిళతో తన భర్త సహజీవనం చేస్తున్నాడని పేర్కొంది.
'న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మహిళ మౌన దీక్ష'
By
Published : May 26, 2019, 4:51 AM IST
'న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మహిళ మౌన దీక్ష' భర్త, అత్తమామల నుంచి తనకు ఆదరణ కరవైందంటూ విజయనగరం జిల్లా దత్తివలసలో ఓ మహిళ మౌన పోరాటం చేసింది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో తనను సరిగ్గా చూసుకోవటం లేదని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది.
ఇదీ విషయం...
దుగ్గేరు గ్రామానికి చెందిన సింహాచలం పుష్ప దంపతుల కుమార్తె జయంతికి.. గద్వాలకు చెందిన ఆటోడ్రైవర్ చప్పాలా అనిల్ కుమార్ తో 2017 లో వివాహమైంది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో అదనపు కట్నం కోసం వేధించేవారని ఆరోపించింది. బాధలు తట్టుకోలేక తాను పుట్టింటికి వెళ్లిపోయానని... అనంతరం భర్త అనిల్ కుమార్ పెద్ద వలసకు చెందిన ఓ మహిళను తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకుని తల్లి దండ్రులతో పాటు అత్తవారింటి ముందు మౌనదీక్షకు దిగినట్లు బాధితురాలు తెలిపింది.
'న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మహిళ మౌన దీక్ష' భర్త, అత్తమామల నుంచి తనకు ఆదరణ కరవైందంటూ విజయనగరం జిల్లా దత్తివలసలో ఓ మహిళ మౌన పోరాటం చేసింది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో తనను సరిగ్గా చూసుకోవటం లేదని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది.
ఇదీ విషయం...
దుగ్గేరు గ్రామానికి చెందిన సింహాచలం పుష్ప దంపతుల కుమార్తె జయంతికి.. గద్వాలకు చెందిన ఆటోడ్రైవర్ చప్పాలా అనిల్ కుమార్ తో 2017 లో వివాహమైంది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో అదనపు కట్నం కోసం వేధించేవారని ఆరోపించింది. బాధలు తట్టుకోలేక తాను పుట్టింటికి వెళ్లిపోయానని... అనంతరం భర్త అనిల్ కుమార్ పెద్ద వలసకు చెందిన ఓ మహిళను తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకుని తల్లి దండ్రులతో పాటు అత్తవారింటి ముందు మౌనదీక్షకు దిగినట్లు బాధితురాలు తెలిపింది. Intro:ap_cdp_16_25_central_jail_nandanavanam_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
కేంద్ర కారాగారం అనగానే కఠిన శిక్షలు.. చీకటి గదులు.. ఒకే గదిలో మలమూత్ర విసర్జన శాలలు.. అపరిశుభ్రత వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఇది 30 ఏళ్ల క్రిందట ఉండేది. కానీ ఇప్పుడున్న జైలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక్కసారి ఈ కేంద్ర కారాగారం పరిశీలిస్తే ఇది కేంద్ర కారాగారం లేదా నందనవనం అనే విధంగా తలపిస్తుంది. కేంద్ర కారాగారం ఎటు చూసినా పచ్చదనమే దర్శనమిస్తుంది. కొన్ని వేల మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బృందావనం తలపిస్తుంది. అయితే ఆ కేంద్ర కారాగారం ఎక్కడుంది.. అనుకుంటున్నారా... అయితే వెళ్దాం రండి..
వాయిస్ ఓవర్:1
కడప శివారులోని ప్రత్యేక మహిళా కారాగారాన్ని ఏర్పాటు చేశారు. సుమారు వందమంది మహిళా ఖైదీలు ఉన్నారు. వీరందరూ వివిధ జిల్లాల నుంచి వివిధ రకాల నేరాలు చేసి వచ్చారు. జైలుకు వచ్చిన వారిని ఖాళీగా కూర్చో పెడితే లేనిపోని ఆలోచనలు వస్తాయని ఉద్దేశంతో అధికారులు వారికి వివిధ రకాల పనులను అప్పగించారు. అందులో భాగంగా ప్రస్తుత రోజుల్లో ఎక్కడ చూసినా వాతావరణం కలుషితం అయింది. వాతావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జైలు అధికారి వసంత మొక్కల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు ప్రత్యేక మహిళా కారాగారంలో కొన్ని వేల మొక్కలను పెంచారు. వీటితోపాటు సుమారు 100 వరకు చెట్లను పెంచారు. జైలు వద్దకు రాగానే పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఉన్నాయి. పచ్చదనమే కాదు జైలు ఆవరణలో అంత ముగ్గులతో అదొక హరివిల్లు వాతావరణం తలపిస్తుంది. పూల మొక్కల సంరక్షణ మహిళా ఖైదీలకు అప్పగించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పోయడం వాటి సంరక్షణ బాధ్యతను పూర్తిగా మహిళా ఖైదీలు చేస్తున్నారు. మామిడి, పనస, బొప్పాయి, ఖర్జూరం, అరటి, దానిమ్మ, ఇలాంటి పండ్ల చెట్టు తో పాటు రోజా, కనకాంబరం, లిల్లీ పువ్వు, బంతి పువ్వు ఇలాంటి పూల మొక్కలు గోంగూర, మెంతి ఆకు, పాలకూర కరివేపాకు, టమోటా, బంగాళదుంప, కొత్తిమీర, ఆకుకూరలు పుష్కలంగా ఉన్నాయి. ఖైదీలు మొక్కలను తమ సొంత బిడ్డల చూసుకుంటున్నారు. జైలు కు వచ్చే ముందు అనారోగ్యంతో ఉన్న మహిళా ఖైదీలు విడుదలై వెళ్లేటప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్తున్నారు. కారణం అక్కడ ఉన్న పచ్చదనమే అని చెప్పాలి. ఉదయాన్నే మొక్కలను చూడడం వలన మంచి జరుగుతుందని మొక్కలను తమ సొంత మనుషులుగా చూసుకుంటున్నామని మహిళా ఖైదీలు అన్నారు.
byte: హసీనా, మహిళ ఖైదీ, కడప.
byte: గ్రేస్ అమ్మ, మహిళా ఖైదీ కడప.
byte: గురమ్మ, మహిళా కడప.
వాయిస్ ఓవర్:2
కేంద్ర కారాగారం పట్ల ప్రజల్లో ఉన్న భావనను తొలగించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాను. ప్రస్తుత రోజుల్లో పచ్చదనం లేక వర్షాలు కురవక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తమ వంతుగా కేంద్ర కారాగారంలో లో మొక్కలు, చెట్లను నాటి వాతావరణం కాలుష్యం కాకుండా కృషి చేస్తున్నాను. కొన్ని వేల మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. వాటి నిర్వహణ బాధ్యతను ఖైదీలు చాలా చక్కగా చూస్తున్నారని జైలు అధికారి వసంత పేర్కొన్నారు.
byte: వసంత, ప్రత్యేక మహిళా కారాగార అధికారి, కడప.
వాయిస్ ఓవర్:
కేంద్ర కారాగారం అంటే కఠిన శిక్షలు కావని అదొక శిక్షణాలయం అని పచ్చదనానికి పరిశుభ్రతకు మారుపేరని నిరూపించారు. బహుశా ఏపీలోనే ఇలాంటి మహిళా కేంద్ర కారాగారం ఇదొక్కటే పచ్చదనంతో ఉండడం అభినందనీయం.
Body:కేంద్ర కారాగారం కాదది నందనవనం
Conclusion:కడప