ETV Bharat / state

విజయనగరం జిల్లా కలెక్టర్​కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్​ పురస్కారం - విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్

విజయనగరం కలెక్టర్ హరి జవహర్ లాల్ కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అవర్ నైబర్​హుడ్ హానర్ పురస్కారంతో సత్కరించింది. జిల్లాలో కరోనా కట్టడికి కలెక్టర్ తీసుకున్న చర్యలకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.

విజయనగరం జిల్లా కలెక్టర్ కు హెచ్‌డీఎఫ్‌సీ ఓఎన్‌హెచ్ పురస్కారం

author img

By

Published : Aug 19, 2020, 5:37 PM IST

విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌కు మ‌రో అరుదైన‌ గౌర‌వం ద‌క్కింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు‌ ఓఎన్‌హెచ్ (అవ‌ర్ నైబ‌ర్‌హుడ్ హాన‌ర్‌) పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. జిల్లాలో క‌రోనా నివారణకు చేపట్టిన చర్యలు, మరణాల సంఖ్యను అదుపు చేయడంలో కలెక్టర్ తీసుకున్న చ‌ర్య‌లకు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

కొవిడ్ నియంత్ర‌ణ‌కు విశేషంగా కృషి చేస్తున్న అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా ఓఎన్‌హెచ్ ‌ పుర‌స్కారాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అంద‌జేస్తోంది. మొట్ట‌మొద‌టిగా ఈ అవార్డుకు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌ను ఎంపిక చేశారు. ఈ పుర‌స్కారాన్ని ఆ బ్యాంకు ఉన్న‌తాధికారులు క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో అంద‌జేసి, శాలువ‌తో స‌త్క‌రించారు. ఈ కార్యక్ర‌మంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స‌ర్కిల్ హెడ్ టీవీఎస్ రావు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సందీప్ ప‌ట్నాయ‌క్‌, రిలేష‌న్స్‌ మేనేజ‌ర్ ఎస్‌. ప్ర‌వీణ్‌, ఎఎస్ఎం శ్రీ‌దేవి, బ్రాంచ్ మేనేజ‌ర్‌ ఠాగూర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : 'ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రానికి సంబంధం లేదనడం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.