ETV Bharat / state

నానమ్మ మృతి చెందిన కొన్ని గంటల్లోనే... - vizaynagaram news

నానమ్మ మృతి చెందిన కొన్ని గంటల్లోనే మనవడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చోటు చేసుకుంది. వీరిద్దరివి కొవిడ్ మరణాలు కావని అధికారులు తేల్చారు.

The incident took place in Sringavarapukota in Vijayanagaram district, where the grandson died within hours of the grandmother's death
శృంగవరపుకోటలో దారుణం
author img

By

Published : Aug 29, 2020, 3:05 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని గౌరీశంకర్ కాలనీలో దారుణం జరిగింది. నాన్నమ్మ మృతి చెందిన గంటల్లోనే మనవడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

శృంగవరపుకోట పట్టణంలో గౌరీశంకర్ కాలనీలో వి.కాసులమ్మ(90) అనారోగ్యంతో అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మరణించింది. మూగ చెవుడుతో ఉన్న ఆమె మనవడు వీరాచారి(40)... మృతదేహం వద్ద విలపిస్తూ ఉదయం 5 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఇంట్లో మరో మనవడు జ్వరంతో ఉండటంతో... కరోనా భయంతో బంధు మిత్రులు ఎవరు ఇంట్లోకి వెళ్లడానికి సాహసించలేదు.

సీఎంవో స్పందన...

ఎస్‌.కోటలో నానమ్మ, మనవడి మృతి ఘటనపై సీఎంవో స్పందించింది. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ఇద్దరివీ కొవిడ్ మరణాలు కావని అధికారులు తేల్చారు. కుటుంబ సంప్రదాయాల మేరకు అంత్యక్రియలు నిర్వహించామని అధికారులు తెలిపారు. మిగతా 8 మంది కుటుంబసభ్యులకు కొవిడ్ పరీక్షలు చేయిస్తామని..పరీక్షల నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సీఎంవో కార్యాలయానికి ఎస్.కోట తహసీల్దార్ నివేదిక పంపారు.

ఇవీ చదవండి..కారుతో ఎస్సైని ఢీకొట్టి... కొంత దూరం తీసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.