తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు కాగడాలతో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపుతోనే తెదేపా సీనియర్ నేతలపై అవినీతి అభియోగాలు మోపుతున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..