విజయనగరం జిల్లాలో అయినాడ జంక్షన్ నుంచి ధర్మపురి మీదుగా రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వరకు రహదారి విస్తరణ చేపట్టాలని తెదేపా నేత అధితి గజపతి రాజు డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా.. పనులు ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి విజయనగరం పట్టణం మీదుగా చీపురుపల్లి, రాజాం, పాలకొండ వెళ్లే వాహనాలకు ఈ రహదారి ఎంతో ఉపయోగమన్నారు. రహదారి గతుకులమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతన్నారని అధితి గజపతి రాజు అన్నారు. రహదారి విస్తరణ పనులు చేపట్టాలని తెదేపా నేతలు.. గ్రీవెన్స్‌లో జేసీ సింహాచలంకు వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి: ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డి