విజయనగరం జిల్లా పార్వతీపురంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరం రీచ్ నుంచి ఇసుకను ఈ లారీలు తరలిస్తుండగా పట్టుబడ్డాయి.
లారీ చోదకులు వాహన అద్దాలపై ఆన్ డ్యూటీ ఏపీఎండీసీ అన్న స్టిక్కర్లు అంటించారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం ఇసుక రవాణా చేసే సమయంలో మాత్రమే ఈ స్టిక్కర్లు అంటిస్టుండగా... అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పుడు ఈ స్టిక్కర్లను లారీలపై ఉంచారు. ఎటువటి అనుమతి పత్రాలు లేకుండా పార్వతీపురం శివారులోని ఓ ప్రైవేట్ నిర్మాణం వద్ద ఇసుకను అన్లోడ్ చేస్తుండగా పోలీసులకు పట్టుకొని.. నిందులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: వరంగల్లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు