Ramatheertham Temple: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన రామతీర్థం కోదండరామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. రుత్వికులు నీలాచలం కొండపై స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2020 డిసెంబర్లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆలయాన్ని పునఃనిర్మించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గైర్హాజరయ్యారు.
ఇదీ చదవండి: Power Usage: పరిశ్రమలకు విరామం ఇచ్చినా.. తగ్గని విద్యుత్ వినియోగం