ETV Bharat / state

విజయనగరం నగరపాలక సంస్థలో కలిసినా.. తప్పని తిప్పలు - విజయనగరం కార్పొరేషన్​లో వీలిన గ్రామాల సమస్యలు న్యూస్

పంచాయతీ నుంచి పదోన్నతి పొంది నగరపాలికలో కలిశాం... ఇంకేం సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని భావించారు ఆ గ్రామాల ప్రజలు. తీరా పురపాలికలో విలీనం అయ్యాక చూస్తే.. బిందెడు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇక ఇతర మౌలిక సౌకర్యాల ఊసే లేదు. విజయనగరం కార్పొరేషన్‌లో విలీనమైన సమీప గ్రామాల ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది.

విజయనగరం నగరపాలక సంస్థలో కలిసినా.. తప్పని తిప్పలు

author img

By

Published : Feb 28, 2021, 12:09 PM IST

విజయనగరం నగరపాలక సంస్థలో కలిసినా.. తప్పని తిప్పలు

విజయనగరం పురపాలక సంస్థ 1888లో ఆవిర్భవించగా...1988 నాటికి సెలక్షన్‌ గ్రేడ్‌ పురపాలక సంస్థగా హోదా పొందింది. రోజురోజుకు విస్తరిస్తున్న నగరం పురపాలక స్థాయి నుంచి నగరపాలక సంస్థగా మార్పు చెందింది. ఆ సమయంలో నగరానికి సమీపంలో ఉన్న గాజులరేగ, వేణుగోపాల్‌ నగర్‌, అయ్యన్నపేట, జమ్ము, కె.ఎల్.పురం, ధర్మపురి, కణపాక గ్రామాలను.. విజయనగరం నగరపాలక సంస్థలో విలీనం చేశారు.

అప్పట్లో ఆయా గ్రామాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైనా.. సమస్యలు పరిష్కారం అవుతాయన్న ప్రజాప్రతినిధుల హామీతో విలీనానికి ఒప్పుకున్నారు. ఎనిమిదేళ్లు గడిచినా సమస్యలు తీరకపోగా.. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక మౌలిక వసతుల కొరత ప్రజలను వెంటాడుతోంది. తాగునీరు, రహదారులు, మురుగు నీటి సౌకర్యాల లేమితో ప్రజలు సతమతం అవుతున్నారు.

విలీన కాలనీలు అన్నింటిలోనూ తాగునీటి సమస్య తాండవిస్తోంది. 90శాతం మంది చేతిపంపులపైనా ఆధారపడాల్సిన పరిస్థితి. కార్పొరేషన్ ట్యాంకర్లు ఏర్పాటు చేసినా.. ఇచ్చే రెండు బిందెల నీళ్లు తమ అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదని స్థానికులు అంటున్నారు. పైగా రోజు మార్చి రోజు వస్తున్నాయని చెబుతున్నారు. గతంలో కుళాయిలు ఏర్పాటు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసినా.. ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మురుగునీటి కాల్వల నిర్వహణతో పాటు ఇతర వసతుల కల్పన అంతంత మాత్రమేనని.. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను ఎన్నిసార్లు నిలదీసినా.. చేస్తాం, చూస్తాం అని చెప్పి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. విజయనగరానికి కార్పొరేషన్‌ హోదాలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ఎన్నికయ్యే నూతన పాలకవర్గమైనా, విలీన గ్రామాల సమస్యలను పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

మరణించిన వారికి బదులుగా.. నేడు కొత్త నామినేషన్ల దాఖలుకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.