విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బొలెరో వాహనంలో తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కిమిడి గ్రామం నుంచి వాటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్కటి 50 కిలోలున్న 40 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్తున్నాడని పోలీసులు తెలిపారు. బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్ మూర్తికి అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి..