ETV Bharat / state

గెలుపొందిన సర్పంచ్​లకు సన్మానం - విజయనగరం జిల్లా తాజా వార్తలు

విజయనగరం మండలంలో వైకాపా తరపున గెలుపొందిన 17మంది సర్పంచ్​లను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సత్కరించారు. విజయనగరంలోని ఆయన నివాసంలో గెలుపొందిన సర్పంచ్​లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజేతలను శాలువలతో సత్కరించారు.

Ycp_Sarpanchalaku
Ycp_Sarpanchalaku
author img

By

Published : Feb 19, 2021, 10:39 AM IST

విజయనగరం మండలంలో 22 పంచాయతీల్లో రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 20 పంచాయతీలకు జరిగిన పోరులో 15 వైకాపా మద్ధతుదారులు సర్పంచ్​లుగా గెలుపొందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే తమ పార్టీకి చెందిన 17మంది అభ్యర్ధులను గెలిపించాయని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పార్టీ మద్ధతుతో గెలుపొందిన వారు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన సర్పంచ్​ల సత్కార సభ అనంతరం, విజయనగరం 13వ డివిజన్ కొత్తపేటకు చెందిన పలువురిని పార్టీలోకి చేర్చుకున్నారు.

ఇదీ చదవండి: 40 దేశాలకు కొవాగ్జిన్‌- అనుమతి కోరిన భారత్​ బయోటెక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.