బయట మార్కెట్లో ఉల్లి ధర దిగి రావడం లేదు... గత కొన్ని రోజులుగా ఉల్లి ధర ఆకాశంలో విహరిస్తూ ఉండడం వల్ల రాయితీ ఉల్లికి డిమాండ్ పెరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం రైతు బజారులో పోలీసుల బందోబస్తు నడుమ ఉల్లి పంపిణీ చేస్తున్నారు. బయట మార్కెట్లో కిలో రూ.80 పలకటంతో అన్ని వర్గాల వారు రాయితీ ఉల్లి కోసం పరుగులు పెడుతున్నారు. కిలో ఉల్లి రూ.25 రూపాయలకు ఉల్లి తీసుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.
విజయవాడలో
విజయవాడలోని భవానిపురం రైతు బజార్లో సైతం వినియోగదారులు ఉల్లిపాయల కోసం క్యూలైన్లు కట్టారు. ఒక్కటే కౌంటర్ పెట్టినందున వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: