ETV Bharat / state

ధాన్యాన్ని రోడ్డుపై తగలబెట్టి రైతుల నిరసన

author img

By

Published : May 20, 2020, 7:19 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై తగలబెట్టి ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి అధికారులు డబ్బులు ఇవ్వలేదని పురుగులమందు తాగడానికి సిద్ధమయ్యారు.

Farmers  burned grain to protest   in salur
సాలూరులో ధాన్యాన్ని రోడ్డుపై తగులబెట్టి రైతుల నిరసన

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై తగలబెట్టి నిరసన తెలియజేశారు. సాలూరు మండలానికి చెందిన దాదాపు 100 మంది రైతులు రోడ్డుపై ధాన్యం తగలబెట్టారు. పురుగుల మందు వెంటబెట్టుకొని వచ్చి తాగడానికి సిద్ధమయ్యారు. జనవరి నెలలో 1075 రకం ధాన్యం కొనుగోలు చేసి.... డబ్బులు చెల్లించలేదని వాపోయారు. మార్కెట్ అధికారులకు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తగలబెట్టిన రైతులను సాలూరు పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.

ఇదీచూడండి.

'వాహనాలు తిరిగితేనే మాకు పూట గడిచేది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.