విజయనగరం జిల్లా కొమరాడ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని విక్రంపురం గ్రామం నుంచి పార్వతీపురం ఉప కలెక్టర్ కార్యాలయం వరకూ యాత్రగా వెళ్లారు. పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. నెలన్నర రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సంక్రాంతి పండుగ దగ్గర పడటం వల్ల పండిన పంటను విక్రయించుకోలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాలని విన్నవించారు. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను ఉప కలెక్టర్ చేతన్‌కు వివరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: