వచ్చే వారం రోజుల్లో జిల్లాలో రైతుల నుంచి 20 వేల టన్నుల ధాన్యం సేకరించాలని కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్.. పౌరసరఫరాల సంస్థ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ 300 టన్నుల ధాన్యం సేకరిస్తూ వచ్చే వారం రోజుల్లో మరింత వేగవంతం చేయాలని సూచించారు.
రబీ సీజన్లో ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఈ ఏడాది 30 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ లక్ష్యం చేరుకొనే విధంగా కృషి చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: