భారత కమ్యునిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏళ్ళు పూర్తైన సందర్భంగా విజయనగరంలోని ఎల్.బి.జి భవన్ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ జెండా ఆవిష్కరించారు. అనంతరం భారత కమ్యునిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.... కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల కోసమే నిరంతరం పోరాడుతుందని అన్నారు. కమ్యూనిస్టులు త్యాగ నిరతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. దళితులపై వివక్షతకి వ్యతిరేకంగా, గిరిజనులకు అండగా 1/70 చట్టం సాధించింది కమ్యూనిస్టులేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి