ETV Bharat / state

గిరిశిఖరలో కమ్యూనిటీ పోలీసింగ్‌.. గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలు - విజయనగరంలో కమ్యూనిటీ పోలీసింగ్ న్యూస్

ఆ పల్లెల్లో ఎటు చూసినా పచ్చని ప్రకృతి.. ఎత్తైన కొండలు.. లోతైన లోయలు. కానీ అభివృద్ధిలో మాత్రం శతాబ్దాలుగా వెనకబడే ఉన్నాయి. ఇప్పటికీ అగ్గిపెట్టె కావాలన్నా కొండలు, వాగులు దాటాల్సిన పరిస్థితి. అలాంటి గ్రామాలతో పోలీసులు మైత్రి భావంతో మెలుగుతున్నారు. అంతేకాదు.. వారి సమస్యల పరిష్కారంలోనూ అండగా నిలుస్తున్నారు. విజయనగరం(vizianagaram) జిల్లా మక్కువ మండలం గిరిశిఖరలో చేపట్టిన కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రత్యేక కథనం.

community policing in vizianagaram district makkuva mandal

author img

By

Published : Jul 4, 2021, 12:48 PM IST

గిరిశిఖరలో కమ్యూనిటీ పోలీసింగ్‌.. గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలు

విజయనగరం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా(AOB) రాష్ట్ర సరిహద్దు కొఠియా గ్రూప్‌ గ్రామాల గిరిజనులకు జిల్లా పోలీసుశాఖ అండగా నిలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకుండా ఒడిశా(odisha) ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఇక్కడి ఓటర్లు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు.. తాము ఏపీ వైపే ఉంటామని ఒడిశా అధికారులకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొఠియా గిరిశిఖర గ్రామాల సమస్యలపై పోలీసుశాఖ(police department) అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు కమ్యూనిటీ పోలీసింగ్‌(community policing) పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మీ వెంట మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మక్కువ మండలం గిరిశిఖరలో నిర్వహించిన కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమంలో స్వయంగా జిల్లా ఎస్పీ పాల్గొని వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. గిరిజన యువత మావోయిస్టు(maoist) కార్యకలాపాల పట్ల ఆకర్షితులు కావద్దని.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.

పోలీసు శాఖ ఉన్నతాధికారులు.. మారుమూల గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడంపై గిరిపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో రహదారి నిర్మాణానికి పోలీసులు సహాయం అందించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల శతాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న డోలీ బాధలు తప్పాయంటున్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమం అనంతరం ఎస్పీ రాజకుమారి(sp rajakumari).. పలు గిరిజన గ్రామాలను సందర్శించి... స్థానిక పిల్లలకు బిస్కెట్లు, ఇతర తినుబండారాలు అందజేశారు. పెద్దల ఆరోగ్య స్థితిగతుల గురించి స్వయంగా ఆరా తీసి... వారి పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఇదీ చదవండి: KRISHNA WATER: కడలిలోకి కృష్ణమ్మ.. రోజూ అర టీఎంసీ వృథా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.