సర్పంచి పదవికి వేలం నిర్వహించి తద్వారా వచ్చే ఆదాయంతో శివాలయ నిర్మాణం పూర్తిచేసేందుకు విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఇటిక పంచాయతీలోని మూడు గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ సమావేశమై వేలంపాట నిర్వహించారు. రూ.8 లక్షలకు ప్రారంభమై రూ.10 లక్షల వరకు వెళ్లింది. మరోసారి వేలం నిర్వహించనున్నట్లు సమాచారం. పాట ఎంత వరకు వెళ్తుందో.. పదవి ఎవరు కైవసం చేసుకుంటారోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ పంచాయతీలో ఎన్నికలు ఏకగ్రీవమైన సందర్భాలు లేవు.
రూ.8 నుంచి10 లక్షల వరకు వేలం... శివాలయ నిర్మాణం కోసమే ! - విజయనగరం జిల్లా తాజా వార్తలు
శివాలయ నిర్మాణం పూర్తిచేసేందుకు ఆ మూడు గ్రామాల ప్రజలు సర్పంచ్ పదవి వేలానికి సిద్ధమయ్యారు. జియ్యమ్మవలస మండలం ఇటిక పంచాయతీ పరిధిలోని ప్రజలు పార్టీలకు అతీతంగా సమావేశమై పదవికి వేలంపాట నిర్వహించారు. గతంలో ఈ పంచాయతీలో ఎన్నికలు ఏకగ్రీవమైన సందర్భాలు లేవు.
సర్పంచి పదవికి వేలం నిర్వహించి తద్వారా వచ్చే ఆదాయంతో శివాలయ నిర్మాణం పూర్తిచేసేందుకు విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఇటిక పంచాయతీలోని మూడు గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ సమావేశమై వేలంపాట నిర్వహించారు. రూ.8 లక్షలకు ప్రారంభమై రూ.10 లక్షల వరకు వెళ్లింది. మరోసారి వేలం నిర్వహించనున్నట్లు సమాచారం. పాట ఎంత వరకు వెళ్తుందో.. పదవి ఎవరు కైవసం చేసుకుంటారోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ పంచాయతీలో ఎన్నికలు ఏకగ్రీవమైన సందర్భాలు లేవు.
TAGGED:
రూ.8 నుంచి10 లక్షల వరకు వేలం