విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం రామాలయం హుండీ లెక్కింపులో... దేవాదాయశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ సుజాత వాహన డ్రైవర్ నరేష్ చేతివాటం ప్రదర్శించాడు. హుండీ లెక్కింపు సందర్భంగా నరేష్ అనుమానాస్పదంగా వ్యవహరించటంతో ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడిలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నరేశ్ చేతివాటం ప్రదర్శించినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.3వేలు నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో దేవాదాయశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ సుజాత ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.