ETV Bharat / state

బైకును ఢీకొట్టిన కారు: యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Mar 28, 2021, 11:39 AM IST

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో ప్రమాదం.. యువకుడిని బలి తీసుకుంది. కారివలస గ్రామ సమీపంలోని మలుపు వద్ద వెనుక నుంచి వచ్చిన కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

a road accident at kaarivalasa
విజయనగరం జిల్లా కారివలస వద్ద రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కారివలస గ్రామం సమీపంలోని మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రుషింగి గ్రామానికి చెందిన స్నేహితులు శివ, సాయి.. కొమరాడ మండలం పాలెం గ్రామంలోని బంధువులను కలిసి తిరుగు ప్రయాణంలో పార్వతీపురం మీదుగా వెళ్తున్నారు.

కారివలస వద్ద వెనుక నుంచి వచ్చన కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని పార్వతీపురంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో సాయి మృతి చెందాడు. శివను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న ఎస్సై సింహాచలం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు సాయి.. రాజాంలో ఇంటర్మీడియట్ విద్యార్థి. అతని హఠాన్మరణంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.