వైకాపా ప్రభుత్వం బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఏ.ఎం.సీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు అన్నారు. మత్స్యకార, దేవాంగుల కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన చోడిపల్లి శ్రీనివాసరావు, అల్లాడ శివకుమార్లను ఆపార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
గతంలో ఏ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని, కేవలం ఓట్ల కోసమే మాత్రమే ఉపయోగించుకున్నారని వైకాపా నాయకులు విమర్శించారు. బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని అన్నారు.
ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!