ముఖ్యమంత్రి జగన్పై(cm jagan) తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్(mla umashankar ganesh) డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టేందుకు యత్నించారు. చివరకు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో.. ఎమ్మెల్యే గణేష్ సహా పలువురు కార్యకర్తలు అయ్యన్నపాత్రుడుపై ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: