పెద్దేరు జలాశయం నుంచి నీటి విడుదల
విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలో వర్షాలకు భారీగా నీరు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి 3,704 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలో చేరుతోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి 5,204 క్యూసెక్కుల వరదనీటిని పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐ రామారావు..ఇతర అధికారులు జలాశయాన్ని పరిశీలించారు
రైవాడ జలాశయం నుంచి వరదనీరు విడుదల
భారీగా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలోకి భారీగా నీరు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి 5,298 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలో చేరుతోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు జలాశయం రెండు గేట్లు ఎత్తి దిగువన శారదా నదిలోకి 3,656 క్యూసెక్కుల వరద విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైవాడ జలాశయం నుంచి దిగువ శారదా నదిలోకి విడుదల చేయడంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఇదీ చూడండి.