ETV Bharat / state

పెద్దేరుకు జలకళ.. వర్షాలతో చెరువుల్లోకి పుష్కలంగా నీరు

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విశాఖ పెద్దేరులో నీటి ప్రవాం పెరిగింది. గంటికొర్లాం, లూలూరు, బంగారుమెట్ట, వడ్డాది తదితర చోట్ల చెరువుల్లోనూ నీళ్లు చేరి కలకళలాడుతున్నాయి. రైతులంతా నారుమడులను తయారు చేసి వరినాట్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

vishaka pedhuru water flow
vishaka pedhuru water flow
author img

By

Published : Jul 6, 2020, 11:35 AM IST

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వడ్డాది దగ్గర పెద్దేరులో నీటిప్రవాహం పెరిగింది. గ్రోయిన్‌ దగ్గర నిండుగా నీరు చేరి కస్పా కాలువలోకి ఎర్రటి నీటి ప్రవాహం సాగుతోంది. బంగారుమెట్ట దగ్గర గుర్రపుగెడ్డలోనూ నీరు ప్రవహిస్తుంది. ఆనకట్టల దగ్గర నీరు పరవళ్లు తొక్కుతోంది. గంటికొర్లాం, లూలూరు, బంగారుమెట్ట, వడ్డాది తదితర చోట్ల చెరువుల్లోనూ నీళ్లు చేరి కళకళలాడుతున్నాయి. రైతులంతా నారుమడులను తయారు చేసి వరినాట్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మెట్టప్రాంతాల్లో దుక్కులు దున్ని అపరాల పంటలు, చెరకు నాట్లు వేసుకుంటున్నారు.

80.8 మి.మీ వర్షపాతం నమోదు

గడిచిన మూడు రోజుల్లో నర్సీపట్నంలో 80.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వరి నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 2న 14.8 మి.మీ., 3న 3.4 మి.మీ., 4న 62.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జులైలో సాధారణ వర్షపాతం 185 మి.మీ. కాగా నాలుగు రోజుల్లోనే ఆశాజనకంగా వానలు కురిశాయి. వరాహ నదికి వరద నీరు చేరడంతో నర్సీపట్నం పెద్దచెరువు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. పొర్లుకట్ట మీదుగా నీరు ప్రవహిస్తోంది.

వర్షాలతో వరహ నదిలో నీరు ఊరకలేస్తోంది. దార్లపూడి, సోముదేవుపల్లి, పెనుగొల్లు గ్రోయిన్లు నిండుగా దర్శనమిస్తున్నాయి. పెనుగొల్లు గ్రోయిన్‌పై నిర్మించిన గట్టు కోతకు గురైంది. ఏడాది తర్వాత నదిలోకి నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఆరువారాల్లో వ్యాక్సిన్​ అందుబాటులోకి రావడం కష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.