ETV Bharat / state

విశాఖ మన్యం బంద్ ప్రశాంతం

author img

By

Published : Nov 12, 2019, 11:49 PM IST

పోడు భూముల సమస్యలను తీర్చాలంటూ గిరిజనులు పిలుపునిచ్చిన బంద్ విశాఖ మన్యంలో ప్రశాంతంగా సాగింది. పలుచోట్ల వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

Breaking News

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విశాఖ మన్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది. పది రోజులుగా బంద్ పై విస్తృత ప్రచారం చేయగా... ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దశాబ్దాలుగా మన్యంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయని గిరిజన నేతలు ఆరోపించారు. వాహనాల రాకపోకలను నిలిపివేసి రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Intro:AP_VSP_56_12_MANYAM BANDH PRASANTHAM_AV_AP10153Body:
పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండుచేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ విశాఖ మన్యంలో ప్రశాంతంగా జరిగింది. బంద్‌ గురించి గిరిజన సంఘం పది రోజులు ముందునుంచే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో ప్రజలు నుంచి మంచి స్పందన వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా మన్యంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని, అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలు నుంచి గిరిజనులను తరిమివేసి ఇక్కడున్న ఖనిజ సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్తవాలు కుట్రలు పన్నుతున్నారని, ఇందులో భాగంగా అడవిపై గిరిజనులకు ఉన్న హక్కుల్ని సవరిస్తూ జారీ చేసిన నూతన అటవీపాలసీ విధానం ను తీసుకురావడం జరిగిందని, దీనివల్ల ఆదివాసీల మనుగడకు ముప్పు వాటిట్టే ఆవకాముందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా మన్యం బంద్‌ను చేపట్టామని గిరిజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు దనుంజయ్‌, మండల అధ్యక్షుడు బాకూరి కోటేశ్వరరావు లు తెలిపారు. మన్యం బంద్‌ సందర్భంగా చింతపల్లి, గూడెంకొత్తవీధి, సీలేరు, జి.మాడుగుల మండలాల్లో వ్యాపారస్థులు దుకాణాలను మూసివేశారు. వాహనాలు రాకపోకలను నిలిపివేసి రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Conclusion:M Ramanarao Sileru 9440715741
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.