ETV Bharat / state

వర్షపాతంలో సమతుల్యత లోపం.. సాగుపై ప్రభావం! - visakha agriculture officers latest News

విశాఖ జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం సమతుల్యత లోపించడంతో ఆ ప్రభావం పంటల సాగుపై పడింది. ఫలితంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లక్ష్యాన్ని విశాఖ చేరుకోలేకపోయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి లక్షా 80 వేల 124 హెక్టార్లు వేయాల్సి ఉండగా, లక్షా 53 రెండు వేల 664 హెక్టార్లలో మాత్రమే పంటలు వేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జిల్లాలో సగటున 80 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగు అయినట్లు అధికారులు భావిస్తున్నారు.

పంటల సాగులో నిర్ధేశిత లక్ష్యాల్ని అందుకోలేకపోయిన విశాఖ జిల్లా

author img

By

Published : Sep 26, 2020, 10:27 PM IST

వాతవరణ అసమతుల్యత కారణంగా ఖరీఫ్ పంటలకు సంబంధించి విశాఖపట్నం జిల్లా నిర్దేశిత లక్ష్యాన్ని చేరడంలో వెనుకంజలో ఉంది. వేసవిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయని.. ఆ తర్వాత నైరుతి ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాల్లోకి కొత్త నీరు చేరింది. క్రమేపీ జూలై రెండో వారం వానలు మొహం చాటేయడంతో వర్షాధార ప్రాంతాల్లో పంటల సాగుపై ఆ ప్రభావం పడింది.

విశాఖ జిల్లాకు సంబంధించి 1,02,74 హెక్టార్ల వరినాట్లు వేయాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 95 వేల 679 హెక్టార్లలో మాత్రమే పంట వేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.

గతంతో పోలిస్తే ఎక్కువే..

గత ఏడాదితో పోలిస్తే 4,645 హెక్టార్లు ఎక్కువ విస్తీర్ణంలో వరి నాట్లు పడ్డాయని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా భీమిలి, ఆనందపురం, సబ్బవరం, పరవాడ , బుచ్చయ్యపేట, నక్కపల్లి మండలాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో 60 నుంచి 80 శాతం విస్తీర్ణంలో ఆయా ప్రాంతాల్లో వరినాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీకి సంబంధించి 42 వేల 996 హెక్టార్లకు గాను 39 ,345 హెక్టార్ల విత్తనం వేయగా.. మైదాన ప్రాంతాల్లో 59 వేల 78 హెక్టార్లకు గాను, 56 వేల 334 హెక్టార్లలో నాట్లు వేసినట్లు స్పష్టం చేశారు.

రెండో ప్రధాన పంట చెరకు..

జిల్లాలో రెండో ప్రధాన పంట అయినా చెరకు సాగుకు సంబంధించి 32 వేల 451 హెక్టార్లకు 23, 568 హెక్టార్లలో పంట వేశారని వివరించారు.

రాగి పంట..

రాగులకు సంబంధించి 17వేల 683 హెక్టార్లకు 16073 హెక్టార్లు, పప్పు ధాన్యాలు 3 వేల 973 హెక్టార్లకు గానూ వెయ్యి 315 హెక్టార్లు, చిరుధాన్యాలను సంబంధించి 6 వేల 283 హెక్టార్లకు గాను 3 వేల 3 హెక్టార్లలకు పంట తగ్గిందన్నారు.

నూనె గింజ పంట..

నూనె గింజలకు సంబంధించి 3 వేల 442 హెక్టార్లకు గాను, కేవలం 2 వేల 732 హెక్టార్లలోనే వేశారన్నారు. పసుపు సాగుకు సంబంధించి 4 వేల 573 హెక్టార్లకు గాను 4వేల 862 హెక్టార్లలోనే విత్తనాలు నాటినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖరుతో ముగుస్తుందని జిల్లాలో వరి నాట్లు వేయడం దాదాపు పూర్తయిందన్నారు. వరి నాట్లు వేయని ప్రాంతాల్లో ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు సాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

ఇవీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పొంగుతున్న నదులు, వాగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.