శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఖండించారు. రాముడు భారతీయుల ఆరాధ్య దైవమని... ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి అని కొనియాడారు.
భారత్లో జన్మించి ప్రపంచానికే నడవడికను నేర్పిన మహా పురుషుడు శ్రీరాముడని.. ఆయన గురించి తెలిసీ తెలియక మాటలాడటం తగదన్నారు. పురాణేతిహాసాల చరిత్రను వక్రీకరించడం సబబు కాదని స్వరూపానందేంద్ర సరస్వతి హితవు పలికారు.
ఇవీ చూడండి: