డాక్టర్ సుధాకర్ విషయంలో ఓ దళత మంత్రి వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారని... తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. సుధాకర్ మీడియా ముందు తాను చేసింది తప్పని ఒప్పుకుంటే, ఉద్యోగం తిరిగి ఇప్పిస్తామని అంటున్నారని తెలిపారు. ఇవి ఆరోపణలు కాదనీ, తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు. వాటిని ఎక్కడికి వచ్చైనా నిరూపిస్తామని తెలిపారు. మాస్కులు అడగటమే, డాక్టర్ సుధాకర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై హైకోర్టు సంచలన ఆదేశాలు