ETV Bharat / state

వందే భారత్ రైలు ప్రయాణం.. అదిరిందంటున్న ప్రయాణికులు - new train from Secunderabad

Vande Bharat Train : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ రైలు ప్రయాణం ఆదివారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి.. వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి మీదుగా విశాఖపట్నం చేరుకున్న రైలుకు.. ప్రతి స్టేషన్‌లోనూ ఘనస్వాగతం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్‌ రైలు ప్రయాణాన్ని.. ప్రయాణికులు అమితంగా ఆస్వాదించారు. అత్యాధునిక సదుపాయాలు ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేశాయి.

Vande Bharat Train
వందే భారత్ రైలు
author img

By

Published : Jan 16, 2023, 7:26 AM IST

Updated : Jan 16, 2023, 8:07 AM IST

వందే భారత్ రైలు ప్రయాణం.. అదిరిందంటున్న ప్రయాణికులు

Vande Bharat Train : తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్‌ రైలు సంక్రాంతి నాడు పట్టాలెక్కింది. దేశీయంగా తయారైన ఈ సెమీ స్పీడ్‌ రైలు.. సోమవారం నుంచి రెగ్యులర్‌గా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య పరుగులు తీస్తుంది. సికింద్రాబాద్‌లో పరుగు ప్రారంభించిన ఈ రైలుకు దారి పొడవునా అపూర్వ స్వాగతం లభించింది. వందేభారత్‌ రైలు ఎన్నో ప్రత్యేకతలతో ప్రయాణికుల మనసు దోచింది. ఇందులో విమానాలలో ఉండే సీట్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో సీట్లను 180 డిగ్రీల కోణం వరకు తిప్పుకోవచ్చు. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాన్సాక్షన్ మోటార్‌తో రూపొందించిన ఆధునిక భోగీలు అమర్చడం వల్ల.. రైలు ఎంత వేగంగా వెళ్లినా కుదుపులు ఉండవు. గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్‌ చేసిన ఈ రైలు.. ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతోంది. ఈ అత్యాధునిక సౌకర్యాల పట్ల ప్రయాణికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

"ఈ రైలులో మొదటి ప్రయాణ అనుభవం చాలా బాగుంది. అది విశాఖపట్టణంలో రావటం నాకెంతో సంతోషంగా ఉంది. సికింద్రాబాద్​​ నుంచి రావటానికి టైమ్​ తగ్గింది. సీటింగ్​, ఇతర ఏర్పాట్లు బాగున్నాయి. ఇండియాలో ప్రయాణం చేసినట్లు కాకుండా విదేశాలలో ప్రయాణించినట్లు అనిపించింది." -ప్రయాణికురాలు, విశాఖపట్టణం

వందేభారత్ రైలును అందరికీ పరిచయం చేసేందుకు రైల్వే శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. ప్రతి డివిజన్‌లోనూ పాఠశాలల విద్యార్థులకు అవగాహన పోటీలు నిర్వహించింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలాగే.. రైల్వే నిర్వహణలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులకు.. తొలిరోజు రైలులో ప్రయాణించే అవకాశం కల్పించింది. వీరితోపాటు లోకో పైలట్‌ ట్రైనీలకూ ప్రయాణించే అవకాశమిచ్చింది. విజయవాడ, రాజమహేంద్రవరం సహా ఇతర స్టేషన్లలో రైలు ఎక్కిన విద్యార్థులు విశాఖ వరకూ ప్రయాణించారు. అందులోని సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికను చూసి వారెవ్వా అని సంబరపడ్డారు. ఇంతటి సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని ఎప్పుడూ అనుభవించలేదంటూ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

"వందేభారత్​ రైలులో ప్రయాణం గొప్ప అనుభవం. ట్రైన్​లో సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి. సమయం కలిసి వస్తోంది. మిగతా ట్రైన్లతో పోల్చుకుంటే చాలా బాగుంది." -విద్యార్థిని

ప్రతి స్టేషన్‌లోనూ ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులూ ఈ రైలుకు స్వాగతం పలికారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైలు ఎక్కి నినాదాలు చేశారు. అనకాపల్లిలో రైలు ఎక్కి ప్రయాణం చేసిన ఎంపీ సత్యవతి వందేభారత్‌ రైలు భారతీయులకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు.

"రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటైంది వందేభారత్​ రైలు. మనము ఊహించని విధంగా ఇందులో ప్రయాణం ఉంది. ఇందులో ఉండే సీటింగ్​ వ్యవస్థ విదేశాలలో ఉన్నట్లు ఉంది. భారతదేశంలో విదేశాలలో ఉన్నటువంటి రైలు వచ్చిందంటే మనం అభివృద్ధి చెందినట్లే. అది ఇంకా గ్రామీణ ప్రాంతాలకు వచ్చిందటే గర్వకారణం."-సత్యవతి, అనకాపల్లి ఎంపీ

వందేభారత్ రైలును అత్యాధునిక సాంకేతికతో రూపొందించారని.. లోకో పైలట్లు, సిబ్బంది వివరించారు. వందేభారత్ రైలు తెలుగు ప్రజల పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని.. విశాఖ డీఆర్​ఎం అనూప్‌కుమార్‌ అన్నారు. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి మరిన్ని సర్వీసులను నడిపే ఆలోచన చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి :

Last Updated : Jan 16, 2023, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.